Hyderabad Water Supply | తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) మహా నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న మంజీరా ప్రాజెక్టులోని కలబ్‌గూర్ సబ్‌స్టేషన్‌లో 33 కేవీ అవుట్‌డోర్ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ (VCB) ఏర్పాటు, నిర్వహణ పనులు చేపడుతున్నారు. ఈ పనులు బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగనున్నాయి. ఈ 6 గంటలు కొన్ని ప్రాంతాల్లో పాక్షిక, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయ కలగనుంది.

Hyderabad Water Supply | అంతరాయం ఏర్పడే ప్రాంతాలు

ఆర్.సి.పురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, హఫీజ్‌పేట్, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, బీహెచ్‌ఈఎల్ ఫ్యాక్టరీ, బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్, హెచ్‌సీవై, ఆఫ్‌టేక్ పాయింట్లు, బల్క్ తాగునీటి కనెక్షన్లకు నీటి సరఫరా నిలిచిపోనుంది. జలమండలి వినియోగదారులు ముందస్తుగా అవసరమైన మేరకు తాగునీటిని నిల్వ చేసుకుని, నీటిని పొదుపుగా వినియోగించాలని కోరింది. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే సాధారణ తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Alprazolam Supply Gang | అల్ప్రాజోలం సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *