అక్షరటుడే, వెబ్‌డెస్క్: ED Raids Hyderabad | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఈడీ సోదాలు కలకలం రేపాయి. రూ.3 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు బుధవారం ఉదయం హైదరాబాద్, విశాఖపట్నంలో సోదాలు చేశారు.
రూ.3 వేల కోట్ల చిట్ ఫండ్ స్కామ్‌పై ఈడీ దూకుడు పెంచింది. వెల్ఫేర్ గ్రూప్ ఛైర్మన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ ఇంటితో పాటు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. బీహార్‌కు చెందిన అధికారులు ఏకకాలంలో ఐదు చోట్ల సోదాలు జరుపుతున్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఛైర్మన్‌గా అవకతవకలకు పాల్పడినట్లు విజయప్రసాద్‌పై ఆరోపణలు ఉన్నాయి. కాగా ఆయన ప్రస్తుతం విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు.
ED Raids Hyderabad | బీహార్‌లో కేసులు
వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ కంపెనీపై బీహార్‌లో సైతం కేసులు నమోదు అయ్యాయి. దీంతో స్థానిక అధికారులతో పాటు బీహార్ నుంచి ఈడీ అధికారులు వచ్చి సోదాలు చేయడం గమనార్హం. విజయ ప్రసాద్ చిట్‌ఫండ్స్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేసిన నిధులను దారి మళ్లించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Santosh Nagar Steel Bridge | ప్రారంభానికి సిద్ధంగా స్టీల్ బ్రిడ్జి.. తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు