అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Petrol Shortage | ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ కోసం వాహనదారులు బంక్‌లకు పరుగులు పెడుతున్నారు. గంటల తరబడి వేచి ఉండి పెట్రోల్ పోయించుకుంటున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఇటీవల ముడి చమురు రవాణాలో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉద్రిక్తతలు కాస్త చల్లబడ్డాయి. ఈ సమయంలో ఏపీలో పెట్రోల్ కొరత నెలకొనడం గమనార్హం. అయితే పెట్రోల్ దొరకదనే పుకార్లతో ప్రజలు భారీగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొరత నెలకొందని తెలుస్తోంది. కాగా మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Petrol Shortage | కిలోమీటర్ల మేర..
పెట్రోల్, డీజిల్ (Diesel) కోసం వాహనదారులు బంక్‌ల వద్ద గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఏ బంక్ వద్ద చూసినా.. కిలో మీటర్ల మేర క్యూలైన్లు దర్శనం ఇస్తున్నాయి. కొంతమంది బాటిళ్లు, టిన్నుల్లో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్నారు. విజయవాడ (Vijayawada)లోని పలు పెట్రోల్ బంక్‌ల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని బంక్‌ల్లో పరిమితంగా ఇంధనం అందిస్తున్నారు. మోటార్ సైకిళ్లకు రూ.300 వరకు, ఫోర్ వీలర్లకు రూ.1500 వరకు మాత్రమే పెట్రోల్, డీజల్ పోస్తున్నట్లు సమాచారం.
Petrol Shortage | బ్లాక్ మార్కెట్కు..
పెట్రోల్ బంక్‌ల యజమానులు ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బద్వేల్ మండలం తొట్టిగారి పల్లె వద్ద ఉన్న KR ఫిల్లింగ్ స్టేషన్లో అర్ధరాత్రి డ్రమ్ముల్లో పెట్రోల్, డీజిల్ నింపుకెళ్లారు. వాహనాల్లో నింపకుండా తమకు సంబంధించిన వాళ్లకు డ్రమ్ముల్లో పెట్రోల్ నింపుతున్న బంక్ నిర్వాహకులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్కు తరలించి క్యాష్ చేసుకుంటున్నారని ఆరోపించారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో సైతం పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. ఉదయం నుండే క్యాన్లతో ప్రజలు తరలి వచ్చారు. పెట్రోల్ కోసం బంక్ సిబ్బందితో గొడవ పడుతున్నారు. దీంతో పోలీసుల పర్యవేక్షణలో ఇంధనం నింపుతున్నారు.
Petrol Shortage | సీఎం చంద్రబాబు సమీక్ష

పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సరఫరా 10 శాతం పెరిగినా ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9048 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని.. కొరత ఉందనే ఆందోళనతో కొనుగోళ్లు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు. శనివారం 10,345 కి.లీ పెట్రోల్, 14,156 కి.లీ డీజిల్ విక్రయాలు జరిగాయని వివరించారు. ఒక్కసారిగా 50 శాతం విక్రయాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని వివరించారు.
రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత!
కృష్ణా జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న ప్రజలు. #KrishnaDistrict #FuelCrisis pic.twitter.com/umcQ3CPSF9
— UttarandhraNow (@UttarandhraNow) April 25, 2026
దీనిని కూడా చదవండి : Chandrababu Naidu Award | ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు అందుకున్న చంద్రబాబు

