అక్షరటుడే, బాన్సువాడ: Siddapur Reservoir | సిద్దాపూర్ రిజర్వాయర్‌తో సాగునీటి కష్టాలు దూరమవుతాయని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. వర్ని(varni) మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు.
Siddapur Reservoir | ఇంజినీర్లతో సమీక్ష
రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు. నాలుగు బండ్లలో భాగంగా తొలి బండ్ నిర్మాణంలో రెండు స్లూయిస్‌లు (తూములు) పూర్తిగా నిర్మాణం పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్మాణాల వల్ల గతంలో సిద్దాపూర్ చెరువులో నిల్వ ఉండే నీటి పరిమాణంతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు రెట్టింపు స్థాయిలో నీటిని నిల్వ చేసే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే కట్ట ఎత్తు సుమారు ఐదు మీటర్లు పెరగడంతో రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. రిజర్వాయర్ ద్వారా సిద్దాపూర్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టం పెరిగే అవకాశముందని తెలిపారు.
ఆయకట్ట పరిధిలోని వ్యవసాయ భూములకు వానాకాలం, వేసవి పంటలకు అవసరమైన నీటి నిల్వ ఇప్పటికే అందుబాటులో ఉండడంతో రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవని వెల్లడించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిన అనంతరం సిద్దాపూర్ రిజర్వాయర్ ఆయకట్ట పరిధిలోని సుమారు 10 వేల ఎకరాలకు సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమై, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy Sergio Gor | తెలంగాణ విద్యార్థుల కోసం అమెరికా వీసాలు పెంచాలి : యూఎస్ రాయబారితో సీఎం రేవంత్