హైదరాబాద్Uppal Chowrasta | ఉప్పల్ చౌరస్తా బంద్.. వాహనదారుల ఇబ్బందులు

Uppal Chowrasta | ఉప్పల్ చౌరస్తా బంద్.. వాహనదారుల ఇబ్బందులు

ఉప్పల్​ చౌరస్తాను అధికారులు ఆదివారం నుంచి బంద్ చేశారు. ఎలివేటెడ్​ కారిడార్​ పనులు కొనసాగుతున్నందున తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uppal Chowrasta | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఉప్పల్​ చౌరస్తాను అధికారులు ఆదివారం నుంచి బంద్ చేశారు. ఎలివేటెడ్​ కారిడార్ (Elevated Corridor)​ పనులు కొనసాగుతున్నందున తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు.

ఉప్పల్ రింగ్​రోడ్డు నుంచి హన్మకొండ, వరంగల్ (Warangal)​ వైపు వెళ్ళే బస్సులు ఆగే బస్టాండ్‌ను నల్లచెరువు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌కు మార్చినట్లు తెలిపారు. నేటి నుంచి అక్కడే బస్సులు ఆగుతాయని పేర్కొన్నారు. బోడుప్పల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద నుంచి భగాయత్ లే-అవుట్ ద్వారా నాగోల్ చేరుకోవాలని సూచించారు.

Uppal Chowrasta | హబ్సీగూడా ద్వారా..

సికింద్రాబాద్ (Secunderabad) నుంచి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ నుంచి నాచారం ద్వారా చెంగిచర్ల చేరుకుని అక్కడి నుండి జాతీయ రహదారికి వెళ్లాలి. చిన్న వాహనాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుంచి రహదారికి చేరుకోవాలని ట్రాఫిక్​ పోలీసులు సూచించారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని రోజులు ఉంటాయో, పనులు ఎన్నటికి పూర్తి చేస్తారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా చౌరస్తా బంద్​ చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

uppal junction

దీనిని కూడా చదవండి : Footpath Encroachments | హైదరాబాద్​ నగరంలో ఫుట్​పాత్​ల ఆక్రమణలు తొలగింపు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...