అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Chain Snatching | నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు.
Kacheguda Bus Terminal | హైదరాబాద్‌లో ప్రజా రవాణాకు ఊతం.. చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్‌కు ప్రణాళిక
కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కాగా, మరో నిందితుడు బాలుడు (జువైనైల్) కావడంతో జువైనైల్ కోర్టులో హాజరుపరిచారు.
Nizamabad Chain Snatching | మిర్చి బండి నిర్వహిస్తున్న సమయంలో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 4, 2026న రాత్రి సుమారు 7:50 గంటల సమయంలో గంగాస్థాన్-1, జాతీయ రహదారి-63 సమీపంలో బొమ్మగోని పద్మ మిర్చి బండి నిర్వహిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు నిందితులు.. ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు.
Nizamabad Chain Snatching | బంగారు గొలుసు స్వాధీనం
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ఇతర సాక్ష్యాలను విశ్లేషించిన అనంతరం ప్రధాన నిందితుడు యోగేంద్ర సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన యోగేంద్ర సింగ్ ప్రస్తుతం నిజామాబాద్‌లో టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకోవడంతో పాటు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విలువైన బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్తే.. తగిన జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ రూరల్ పోలీసులు సూచించారు.