అక్షరటుడే, వెబ్డెస్క్: KC Venugopal Amit Shah | కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్ (IIMUN) కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
మోహన్ భగవత్ గురువారం మాట్లాడుతూ.. ఆందోళన చేసినంత మాత్రానా జెన్ జీ యువత దేశ వ్యతిరేకులు కారు అన్నారు. దీనిపై కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. వారికి యువతపట్ల నిజాయితీ ఉంటే హోం మంత్రి అమిత్ షా (Amit Shah)తో రాజీనామా చేయించాలని డిమాండ్చేశారు. కనీసం పార్లమెంటుకు వచ్చి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల ఆయనకు నిజాయితీ ఉంటే, వారిపై జరిగిన అకృత్యాలను ఖండించాలని పేర్కొన్నారు.
KC Venugopal Amit Shah | విద్యార్థులకు అండగా నిలబడతాం
జార్ఖండ్లో JPSC-JSSC అభ్యర్థుల నిరసనపై వేణుగోపాల్ మాట్లాడారు. విద్యార్థులు తమ న్యాయమైన సమస్యల కోసం ఎక్కడైతే నిజమైన నిరసనలు చేపడతారో, అక్కడ తాము వారికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నిన్న చెప్పింది కూడా అదే అన్నారు. ఎఫ్సీఆర్ఏ బిల్లును తాము వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు మైనారిటీ వర్గాలపై ప్రభావం చూపేంత ముఖ్యమైన బిల్లును హడావుడిగా ఆమోదించలేరన్నారు.
ఇది కూడా చదవండి..: AIIMS Bariatric Surgery | 209 కిలోల బరువున్న వ్యక్తికి బేరియాట్రిక్ సర్జరీ..విజయవంతంగా చేసిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు