Private School Fees | స్కూల్ ఫీజుల మోతపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వసూళ్లపై విద్యాశాఖ కఠిన నిబంధనలు జారీ చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Private School Fees | తెలంగాణలోని ( Telangana )ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వసూళ్లపై విద్యాశాఖ కఠిన నిబంధనలు జారీ చేసింది. తరగతుల వారీగా వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను అధికారిక ఎడ్యుకేషన్ పోర్టల్‌లో విధిగా అప్‌లోడ్ చేయాలని అన్ని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది. అలాగే, పాఠశాల ప్రాంగణంలోనూ ఫీజుల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని, ఫీజుల వివరాలు చూపించని స్కూళ్లకు ముందుగా షోకాజ్ నోటీసులు జంపిస్తామని, ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Private School Fees | పుస్తకాల పేరుతో దోపిడీ..

రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ లాంటి చిన్న తరగతులకే ఏడాదికి రూ.30 వేల నుంచి లక్షల్లో ఫీజులు బాదుతున్నాయి. కేవలం ఫీజులే కాకుండా, స్కూల్‌లోనే పుస్తకాలు, యూనిఫామ్‌లు కొనుగోలు చేయాలంటూ తల్లిదండ్రులపై కండిషన్లు పెడుతున్నాయి. వీటికి సైతం వేల రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయి.

Private School Fees | ప్రభుత్వ చర్యలపై తల్లిదండ్రుల ఆశలు..

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల మోతపై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు తరహాలో ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ స్కూల్ ఫీజులను నియంత్రించాలని, దోపిడీకి పాల్పడే యాజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా విద్యాశాఖ జారీ చేసిన ఈ కొత్త ఆదేశాల వల్ల ప్రైవేట్ స్కూళ్ల నుంచి తల్లిదండ్రులకు ఫీజుల భారం ఏ మేరకు తగ్గుతుందనేది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Pocharam Project Water | పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *