Jana Sena Party | కార్యకర్తలను నాయకులుగా చేసేందుకు పుట్టిన పార్టీ జనసేన : మీసాల

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Jana Sena Party | జనసేన పార్టీ.. కార్యకర్తలను నాయకులుగా చేసేందుకు పుట్టిందని ఆ పార్టీ సీనియర్​ నాయకుడు మీసాల శ్రీనివాస్​రావు (Meesala Srinivas Rao) అన్నారు. ఈ మేరకు నిజామాబాద్​ నగరంలోని(Nizamabad) ప్రెస్ క్లబ్​లో శుక్రవారం ఆయన మాట్లాడారు.

Jana Sena Party | నిజామాబాద్​, జహీరాబాద్​ జిల్లాల..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాల సన్నాహాక సమావేశం ఈనెల 8వ తేదీన జిల్లా కేంద్రంలోని సుగుణ గార్డెన్​లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కేంద్రంలో, రాష్ట్రంలోనూ కీలకంగా మారబోతున్నారన్నారు.

8వ తేదీన తేదీన నిర్వహించబోయే సన్నాహాక సమావేశానికి రాష్ట్రంలోని ముఖ్య నాయకులందరూ విచ్చేస్తున్నారని, కార్యకర్తలు అందరూ పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర అబ్జర్వర్ శర్మ, మీడియా ఇన్​ఛార్జి దుంపటి శ్రీనివాస్, జిల్లా నాయకుడు గుండా సంతోష్, కోరుట్ల నాయకులు అజయ్, ఉప సర్పంచు​ల ఫోరం ఉపాధ్యక్షుడు రమేష్ బాసవేణి తదితరులు పాల్గొన్నారు.

meesala srinivas

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *