Telangana Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Forecast | తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది.

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయి. దక్షిణ తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వాన పడుతుంది. హైదరాబాద్​ (Hyderabad) నగరంంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది.

Telangana Rain Forecast | శ్రీశైలంకు కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో వరద వస్తోంది. కర్ణాటకలోని ఆల్మటి జలాశయానికి శుక్రవారం సాయంత్రంతో పోలిస్తే నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) 7,374 క్యూసెక్కులు పెరగగా, విడుదల చేసే నీటి పరిమాణం (అవుట్‌ఫ్లో) 18,155 క్యూసెక్కులు పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,15,874 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 70,655 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గరిష్ట నిల్వ సామర్థ్యం: 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 110.38 టీఎంసీలకు చేరింది. మరోవైపు జూరాల నిండుకుండలా మారడంతో అధికారులు 32 గేట్లను ఎత్తారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం 2,32,308 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 66 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 163.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

దీనిని కూడా చదవండి :  Aug 08 Gold Prices | అమెరికా ఉద్యోగాల డేటా దెబ్బ..బంగారానికి భారీ ర్యాలీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *