Lal Darwaza Bonalu | లాల్​దర్వాజ బోనాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

పాతబస్తీలోని లాల్​దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా సాగుతున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lal Darwaza Bonalu | పాతబస్తీలోని లాల్​దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

బోనాల ఉత్సవాల సందర్భంగా సింహవాహిని అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), పొన్నం ప్రభాకర్​, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ వస్త్రాలు సమర్పించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్​బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు.

Lal Darwaza Bonalu | ఈటల పూజలు

జగద్గిరిగుట్టలోని సంజైపురి కాలనీ, అంజయ్య నగర్​లలో బోనాల వేడుకలకు ఎంపీ ఈటల రాజేందర్​ (Eatala Rajendar) హాజరై అమ్మవారిని దర్శించుకుని , ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి బోనాల పండుగ నిదర్శనం అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సకల సంపదలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు మల్కాజిగిరిలోని సఫిల్‌గూడ శ్రీ కట్ట మైసమ్మ, లాలాపేట్‌లోని పోచమ్మ దేవాలయంలో పూజలు చేశారు.

Lal Darwaza Bonalu | ఆలయాలను దర్శించుకున్న కేటీఆర్​

బోనాల నేపథ్యంలో బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)​ పలు ఆలయాలను దర్శించుకున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారి, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

దీనిని కూడా చదవండి : North Korea Troops | ఉత్తర కొరియా నుంచి రష్యాకు 50వేల మంది సైనికులు?: జెలెన్‌స్కీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *