Varanasi Movie | వారణాసి మూవీ.. రుద్రగా మహేశ్​బాబు ఫస్ట్​ లుక్​ విడుదల

వారణాసి మూవీ నుంచి కీలక అప్​డేట్ వచ్చింది. ఈ సినిమాలో రుద్రగా మహేశ్​ బాబు ఫస్ట్​లుక్​ను మేకర్స్​ విడుదల చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Varanasi Movie | మహేశ్​బాబు హీరోగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్​ వేగంగా జరుగుతోంది. ఈ మూవీలో మహేశ్​ రుద్రగా నటిస్తున్నారు. మహేశ్​ బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ రుద్ర (Rudra) ఫస్ట్​ లుక్​ను విడుదల చేసింది.

వారణాసి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేశ్​ నటించిన గుంటూరు కారం అంచనాలు అందుకోలేపోయింది. ఈ క్రమంలో ఆయన తాజా చిత్రంపై ఫ్యాన్స్​ ఆశలు పెట్టుకున్నారు. అంతేగాకుండా రాజమౌళి దర్శకత్వంలో మహేశ్​ తొలిసారి నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్‌ డ్యూయల్​ రోల్​ పోషిస్తున్నారు. ఈ క్రమంలో రుద్ర ఫస్ట్​ లుక్​ను రాజమౌళి మహేశ్​ బర్త్​డే సందర్భంగా సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు.

Varanasi Movie | రుద్ర ప్రపంచం నుంచి..

రుద్ర ప్రపంచం నుంచి చిన్న సర్‌ప్రైజ్‌ అంటూ మహేశ్‌ ఈ ఫొటోలను ఫ్యాన్స్​తో పంచుకున్నారు. చిత్రనిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్‌ సైతం మహేశ్‌కు విషెస్‌ తెలిపింది. ఈ చిత్రాలను పోస్ట్​ చేసిన రాజమౌళి రౌద్రం అంటే అతడి స్వభావం కాదు అనే క్యాప్షన్ పెట్టారు. ఈ మూవీ ప్రపంచంతో పాటు కాలాల్ని చుట్టేసే కథతో తెరకెక్కుతున్నట్లు తెలిసింది.

దీనిని కూడా చదవండి : Nashik Earthquake | మహారాష్ట్రలో భూకంపం.. గోడలకు పగుళ్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *