అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Adivasis Nature Protectors | జల్–జంగల్–జమీన్‌ను కాపాడుతూ తమ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలుగా కొనసాగిస్తున్న ఆదివాసీలు నిజమైన ప్రకృతి రక్షకులు అని నాయక్‌పోడ్ (Naikpod Tribal) జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం(World Tribal Day) సందర్భంగా కొమురంభీం విగ్రహానికి నివాళులు అర్పించారు.
Adivasis Nature Protectors | ఆదివాసీల జనాభా తక్కువ చూపిస్తూ..
గాండ్ల రామచందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆదివాసీల జనాభా సుమారు 6.50 లక్షలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం 16,000 మంది మాత్రమే ఉన్నట్లు చూపించడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ఆదివాసీల వాస్తవ జనాభాను ప్రభుత్వం గుర్తించి, జనాభా ప్రాతిపదికన వారికి అందాల్సిన విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, ఇతర హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు.
Adivasis Nature Protectors | విచారణ పేరుతో..
అదేవిధంగా ఆదివాసీ నాయక్‌పోడ్ విద్యార్థులు ఉన్నత విద్య కోసం కౌన్సెలింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వారిని హోల్డ్‌లో పెట్టి ఎంక్వయిరీ పేరుతో కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులపై ప్రభుత్వం విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమస్యలపై త్వరలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్‌ను కలిసి వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారు భోజన్న, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ విఠల్ రావు, పవన్ కుమార్, దుర్గా మల్లేష్, గంట గంగాధర్, డీఆర్డీవో సాయన్న, దాత్రి అంజయ్య, డాక్టర్ విజయ్ కుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా, సమ్మర్‌ల్యాండ్‌లో భారీ అటవీ అగ్నిప్రమాదం