అక్షరటుడే వెబ్డెస్క్: Chhattisgarh Black Magic | ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక విచిత్ర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కత్తిపోటు కేసులో అరెస్టయిన తమ బంధువుకు త్వరగా బెయిల్ రావాలంటూ ఆయన కుటుంబ సభ్యులు ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటోతో శ్మశానవాటికలో క్షుద్ర పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి వేళ గ్రామ శ్మశానంలో ఈ తతంగాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Chhattisgarh Black Magic | కత్తితో దాడి ..
బిలాస్పూర్ జిల్లా సిపాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్ రి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం ప్రియాన్షు బొలే మరికొందరితో కలిసి ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో పోలీసులు ప్రియాన్షుతో పాటు పలువురిని అరెస్టు చేశారు. మిగతా వారికి బెయిల్ లభించినప్పటికీ, ప్రియాన్షు బొలే బెయిల్ పిటిషన్ మాత్రం హైకోర్టులో పెండింగ్లో ఉంది.
Chhattisgarh Black Magic | రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న గ్రామస్తులు
ప్రియాన్షుకు ఎలాగైనా బెయిల్ ఇప్పించాలనే ఉద్దేశంతో అతడి బంధువు రిషికేశ్ కుమార్ మరో ముగ్గురితో కలిసి శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని శ్మశానవాటికలో క్షుద్ర పూజలు ప్రారంభించారు. శ్మశానంలో ఏదో జరుగుతోందని అనుమానించిన గ్రామస్తులు.. మరుసటి రోజు (శనివారం) రాత్రి మరోసారి వారు అక్కడ పూజలు చేస్తుండగా పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ముగ్గురు నిందితులు పారిపోగా, రిషికేశ్ మాత్రం గ్రామస్తులకు చిక్కాడు.
Chhattisgarh Black Magic | షాకైన పోలీసులు..
సమాచారం అందుకుని వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. అక్కడ పూజా సామగ్రిని చూసి ఆశ్చర్యపోయారు. ప్రత్యేకించి ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ సిన్హా ఫొటోతో పాటు, ప్రధాన నిందితుడు ప్రియాన్షు బొలే, ఈ దాడిలో గాయపడిన వ్యక్తి ఫోటోలు అక్కడ లభించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. పూజా సామగ్రితో పాటు ఫొటోలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
बिलासपुर में सनसनी: हाईकोर्ट के चीफ जस्टिस की फोटो श्मशान घाट में मिली, जमानत के लिए काला जादू!https://t.co/A1SCgWcz3n#छत्तीसगढ़
— PABNA (@pabnaindia) August 9, 2026
ఇది కూడా చదవండి: Plane Crash | కూలిపోయిన శిక్షణ విమానం