అక్షరటుడే, డిచ్పల్లి: National Highway Safety | పోలీసు శాఖ ఆధ్వర్యంలో డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్స్‌లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ రహదారి భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
National Highway Safety | వ్యాపారులకు సూచనలు
డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి మండలాల పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఉన్న దాబాల నిర్వాహకులు, డిచ్పల్లి నుండి మాధవనగర్ వరకు ఉన్న వ్యాపార సముదాయాల యజమానులతో పోలీసులు సమావేశమయ్యారు. ఏసీపీ ప్రకాష్ యాదవ్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) ముఖ్య అతిథులుగా హాజరై వ్యాపారులకు పలు సూచనలు చేశారు. రోడ్డు సేఫ్టీ, పార్కింగ్, జాతీయ రహదారిపై వాహనాల అక్రమ పార్కింగ్తో ప్రమాదాలు జరుగుతున్నాయని, నిర్దేశిత స్థలాల్లోనే వాహనాలు నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వ్యాపార సంస్థలు, దాబాల వద్ద విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దాబాలలో నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ అమ్మకాలు జరపకూడదని, గంజాయి లాంటి మత్తు పదార్థాల వాడకంపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సదస్సులో ఐడీఏఆర్ మేనేజర్ వర్ష, డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై ఎండీ ఆరిఫ్, జక్రాన్‌పల్లి ఎస్సై మహేష్, ఇందల్వాయి ఎస్సై సుమలత పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Har Ghar Tiranga | స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో ‘హర్ ఘర్ తిరంగా’