అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 11 Market Analysis | హార్మూజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరా విషయంలో ఆందోళనలు పెరగడంతో గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా ట్రేడయ్యాయి.
వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగియగా.. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్డ్ గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ (Gift nifty) క్రితం ముగింపుతో పోలిస్తే డిస్కౌంట్‌తో ట్రేడ్ అవుతోంది. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లోని ప్రధాన సూచీలు నెగెటివ్ గా ప్రారంభమవుతాయని సూచిస్తోంది.
Aug 11 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 0.38 శాతం, ఎస్ అండ్ పీ 0.06 శాతం నష్టపోగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.06 శాతం నష్టంతో ఉంది.
Aug 11 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.36 శాతం నష్టపోగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.13 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.02 శాతం పెరిగాయి.
Aug 11 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8.20 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 2.04 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.73 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.77 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.15 శాతం లాభంతో, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.47 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.08 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.14 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 1,974 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 1,290 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలహీనపడి 95.30 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.82 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.71 వద్ద ఉన్నాయి.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 87.87 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.