అక్షరటుడే వెబ్డెస్క్: West Bengal SIR | పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్ల పరిష్కారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఆయా వ్యక్తుల అప్పీళ్ల పరిష్కారానికి సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ECI) అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఓటర్ల తొలగింపుపై వచ్చిన ఫిర్యాదులు, అప్పీళ్లను ఎంతవరకు పరిష్కరించారో స్పష్టమైన సమాచారాన్ని నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.
West Bengal SIR |ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు పిటిషన్..
కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురి ( Adhir Ranjan Chowdhury )దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంపై జవాబు చెప్పాలని ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లోని ప్రతి బ్లాక్లో ‘ఎస్ఐఆర్ ట్రిబ్యునళ్లను’ ఏర్పాటు చేయాలని, బాధితులు చేసుకున్న అప్పీళ్లను నిర్దేశిత వ్యవధిలో వేగంగా పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని అధీర్ రంజన్ చౌధురి తమ పిటిషన్లో కోరారు. ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు ఈ చర్యలు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Young India School | యంగ్ ఇండియా స్కూల్ కలేనా!