Sant Namdev Maharaj | భక్తిశ్రద్ధలతో సంత్ నాందేవ్ మహరాజ్ పుణ్యతిథి

మేరు కులస్తుల ఆరాధ్య దైవం సంత్​ నాందేవ్ మహరాజ్ 676వ పుణ్యతిథి వేడుకలను పోతంగల్ మండలం దోమలేడ్గి విఠలేశ్వర మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కోటగిరి : Sant Namdev Maharaj | మేరు కులస్తుల ఆరాధ్య దైవం సంత్​ నాందేవ్ మహరాజ్ 676వ పుణ్యతిథి వేడుకలను పోతంగల్ మండలం (Pothangal Mandal) దోమలేడ్గి విఠలేశ్వర మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

Sant Namdev Maharaj | కామప్ప మహరాజ్​ ఆధ్వర్యంలో ..

సోమవారం రాత్రి ప్రత్యేక భజనల అనంతరం ఉదయం కామప్ప మహారాజ్ ఆధ్వర్యంలో కీర్తన, భజనలు, జీవిత చరిత్ర ప్రవచనాలు వినిపించారు. మధ్యాహ్నం గులాల్, పల్లకీ సేవ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు, గట్ల రవీందర్ మాట్లాడుతూ.. పాండురంగ విఠలుని పరమ భక్తుడు సంత్​ నాందేవ్​ మహరాజ్​ అన్నారు. కుల మతాలకతీతంగా, భక్తితత్వాన్ని చాటి చెప్పారని గుర్తు చేశారు. ప్రతిఒక్కరు భగవంతుని నామస్మరణ చేస్తూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెల్ల గంగాధర్, శ్రీధర్, మగ్డేవార్ రాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Sriramsagar Project | ఎగువన తగ్గిన వర్షాలు.. శ్రీరాంసాగర్​కు తగ్గుతున్న వరద..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *