అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Cyber Crime Drug Control | నిజామాబాద్ (Nizamabad Police) పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో కట్టుదిట్టంగా వ్యవహరించాలని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Cyber Crime Drug Control | సీసీ కెమెరాలు ప్రారంభం
జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్లో ‘మన ఊరు –మన భద్రత– మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా 25 సీసీ కెమెరాలను సీపీ సాయిచైతన్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. జక్రాన్‌పల్లి గ్రామంలో 25 సీసీ కెమెరాలు పెట్టుకునేందుకు సహకరించిన పంచాయతీని సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్, సీసీఆర్బీ ఏసీపీ గురు నాయుడు, డిచ్పల్లి సీఐ తిరుపతి, జక్రాన్‌పల్లి ఎస్సై మహేష్, సర్పంచ్ బండి పద్మసత్యం, మండల అధ్యక్షుడు రెక్కల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Prohibited Lands | నిషేధిత భూములపై ఆందోళన వద్దు.. మంత్రి పొంగులేటి భరోసా