Geetha Workers Bus Yatra | ఆగస్టు 2 నుంచి గీతన్నల చైతన్య బస్సుయాత్ర

ల్లుగీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గీతన్నల చైతన్య బస్సు యాత్రను నిర్వహిస్తున్నామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ తెలిపారు.

Shivam nagarani

అక్షరటుడే, కామారెడ్డి: Geetha Workers Bus Yatra | కల్లుగీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గీతన్నల చైతన్య బస్సు యాత్రను నిర్వహిస్తున్నామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా (Kamareddy District) కేంద్రంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రేణుక ఫంక్షన్​ హాల్​లో విలేకరులతో మాట్లాడారు.

Geetha Workers Bus Yatra | అమరుల యాదిలో బస్సుయాత్ర..

ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. కల్తీ పేరుతో కల్లుగీత వృత్తిపై పథకం ప్రకారం జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. గీత కార్మికులకు రూ.4వేల పెన్షన్, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా నెల రోజుల్లోనే ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. వృత్తిలో ప్రమాదాలకు సంబంధించి చెల్లించాల్సిన రూ.20కోట్ల ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వలేదన్నారు. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలన్న జీవో ఉన్నా కొత్త దరఖాస్తులు తీసుకోవడం లేదని విమర్శించారు.

Geetha Workers Bus Yatra | తాము కొత్తగా ఏమీ కోరడం లేదు..

తాము కొత్తగా ఏమీ కోరడం లేదని, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కల్లుగీత వృత్తిని ఆధునీకరించి తాటి, ఈత నీరా ఉప ఉత్పత్తులను ప్రోత్సహించాలని, గౌడ కల్లుగీత నిరుద్యోగ యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, యాత్ర బృంద సభ్యులు బాల్నే వెంకట మల్లయ్య, గైని వెంకన్న, బండ కింది అరుణ్ కుమార్, జిల్లా కార్యదర్శి డి.రాజా గౌడ్, ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్, రమేష్ గౌడ్, స్వామి గౌడ్, రాజా గౌడ్, మోహన్ గౌడ్, శంకర్ గౌడ్, సాయ గౌడ్, బస్వాగౌడ్, కామారెడ్డి టౌన్ వన్ సొసైటీ అధ్యక్షుడు బండారి రాజా గౌడ్, రామ్ చందర్ గౌడ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Lalita Jewellery IPO | ఐపీవోకు లలితా జువెలరీ మార్ట్.. 17 నుంచి అందుబాటులోకి..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *