RTC Workers Welfare | ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎస్​డబ్ల్యూయూ కృషి

ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎస్​డబ్ల్యూయూ కృషి చేస్తోందని కాంగ్రెస్​ నిజామాబాద్​ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: RTC Workers Welfare | ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎస్​డబ్ల్యూయూ (SWU) కృషి చేస్తోందని కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ (INTUC) ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

RTC Workers Welfare | డిపో–2 ఆర్టీసీ ప్రాంగణంలో..

ఈ సందర్భంగా నగరంలోని ఆర్టీసీ డీపో–2 ప్రాంగణంలో ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ యూనియన్ (RTC SWU – INTUC) ఆధ్వర్యంలో యూనియన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా SWU (INTUC) యూనియన్ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం యూనియన్ శ్రమిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, ఆర్టీసీ ఎస్​డబ్ల్యూయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Arvind Divyang Welfare | దివ్యాంగుల సంక్షేమంపై దృష్టిపెట్టాలి: ఎంపీ అర్వింద్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *