Kaleshwaram Medigadda Case | మేడిగడ్డ బ్యారేజీ కేసు.. మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kaleshwaram Medigadda Case | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనకు సంబంధించి జరుగుతున్న విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో పంపిన నోటీసులు ఆయనకు అందలేదని నిర్ధారణ కావడంతో, ఈసారైనా పక్కాగా అందజేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Kaleshwaram Medigadda Case | కొనసాగుతున్న న్యాయస్థాన విచారణ..

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అక్రమాలు, నాణ్యతా లోపాలు ఉన్నాయంటూ గతంలో రాజలింగమూర్తి అనే వ్యక్తి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం పిటిషనర్ మృతి చెందినప్పటికీ, కేసు విచారణను నిలిపివేయకుండా కొనసాగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో భూపాలపల్లి జిల్లా కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఇది కూడా చదవండి:  Farmer ID Registration | ఫార్మర్​ ఐడీ లేకుంటే.. పథకాలన్నీ బంద్..!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *