Urea Shortage Farmers | యూరియా కోసం కాళ్లు మొక్కిన రైతు

యూరియా బస్తాల కోసం ఓ రైతు అధికారుల కాళ్ల మీద పడ్డాడు. ఈ ఘటన మెదక్​ జిల్లాలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urea Shortage Farmers  | యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. బస్తా యూరియా దొరకక అవస్థలు పడుతున్నారు. నిత్యం ఎరువుల దుకాణాలు, సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు.

మెదక్​ జిల్లా (Medak District) కొల్చారం మండలం రంగంపేటలో ఓ రైతు యూరియా కోసం సొసైటీ సిబ్బంది కాళ్ల మీద పడ్డాడు. ఎలాగైనా రెండు బస్తాల యూరియా ఇవ్వాలని వేడుకున్నాడు. తనకు ఆన్​లైన్​లో బుక్​ చేయడం రాదని ఎవరి పేరు మీద​ అయినా ఇప్పించాలని కోరారు. కావాలంటే అధిక ధర చెల్లిస్తానని వాపోయాడు. అయినా సదరు సొసైటీ సిబ్బంది తాను ఏమి చేయలేనని చెప్పి చేతులు ఎత్తేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక యూరియా బస్తా కోసం రైతన్నలు అధికారుల కాళ్లు మొక్కాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి దిగజార్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్​ఎస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Urea Shortage Farmers  | యాప్​లో బుకింగ్​

యూరియా బుకింగ్​ కోసం ప్రభుత్వం ఇటీవల మరో యాప్​ను తీసుకొచ్చింది. గతంలో ఫెర్టిలైజర్​ యాప్​ ద్వారా యూరియా బుకింగ్​ చేసుకునేవారు. ఇటీవల అన్ని ఎరువుల కోసం ప్రభుత్వం ఫ్రేమ్​ వర్క్​ ఫర్​ ఫర్టిలైజర్​ యాప్​ను ప్రవేశ పెట్టింది. ఈ యాప్​లో బుక్​ చేసుకుంటేనే యూరియా లభిస్తోంది. మొదట ఈ యాప్​లో బుక్​ చేసుకొని సంబంధిత దుకాణానికి వెళ్లి ఎరువులు కొనుగోలు చేయాలి. కానీ చాలా మంది రైతులకు ఎలా బుక్​ చేసుకోవాలో తెలియడం లేదు. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు పంటకు యూరియాఆ వేయాల్సిన సమయం దాటి పోతున్నా.. ఎరువులు దొరకకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: Jurala Project Flood | జూరాలకు తగ్గిన వరద..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *