అక్షరటుడే, వెబ్డెస్క్: Kiren Rijiju | కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విపక్ష ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరగనీయకపోవడంపట్ల మండిపడ్డారు. కొత్త ఎంపీలకు విపక్ష సభ్యులు ఏం నేర్పిస్తున్నారని ప్రశ్నించారు. నినాదాలు రోడ్లపై చేయాలి.. పార్లమెంట్‌లో కాదన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ముగిశాయి. అనంతరం కిరణ్ రిజిజు (Kiren Rijiju) మాట్లాడుతూ.. లోక్‌సభలో 11 బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందగా, ఒక బిల్లుపై చర్చ జరిగిందన్నారు. గతంలో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తూనే చర్చల్లో పాల్గొనేవన్నారు. కానీ వీరు మాత్రం ప్రతిపక్ష పాత్రలో ఉంటూనే చర్చకు దూరంగా పారిపోయారని విమర్శించారు. ముఖ్యంగా లోక్‌సభలో… ప్రతిపక్షం చర్చకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి అన్నారు.
Kiren Rijiju | ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
ప్రతిపక్షం ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరుతుందని కిరణ్ రిజిజు అన్నారు. కానీ పార్లమెంటులో ప్రభుత్వం చర్చ జరపాలని కోరుతుంటే, ప్రతిపక్షం మాత్రం దాన్ని తప్పించుకోవడానికి సాకులు వెతికిందన్నారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేయడం, ప్లకార్డులు, బ్యానర్‌లతో గందరగోళం సృష్టించడం పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో కేటాయించిన మొత్తం సమయానికి సంబంధించి కేవలం 19శాతం ఉత్పాదకతను మాత్రమే సాధించామన్నారు. రాజ్యసభలో ఉత్పాదకత 39 శాతంగా ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Prajwal Revanna | మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలు గదిలో ఫోన్ లభ్యం