Har Ghar Tiranga Rally | కామారెడ్డిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

కామారెడ్డిలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Har Ghar Tiranga Rally | పట్టణంలో గురువారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భారీ  ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కామారెడ్డి (Kamareddy) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పాల్గొని జాతీయ జెండాను చేతబూని కార్యకర్తలు, నాయకులతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడిచారు.

Har Ghar Tiranga Rally | గాంధీ గంజ్ నుంచి..

పట్టణంలోని గాంధీ గంజ్ నుంచి మొదలైన ఈ ర్యాలీ జేపీఎన్ రోడ్, సుభాష్ రోడ్, ధర్మశాల, ఇందిరాచౌక్, రైల్వే కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు సాగింది. నిజాంసాగర్ చౌరస్తాలో జనగణమన జాతీయ గీతాళాపనతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, బీజేపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Bheemgal Tahsildar Office | భీమ్‌గల్‌ తహశీల్దార్ కార్యాలయంలో సబ్‌కలెక్టర్ తనిఖీలు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *