అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eagle Force | హైదరాబాద్ (Hyderabad) నగరంలో గంజాయి దందా ఆగడం లేదు. ఈగల్ ఫోర్స్, ఎస్వోటీ (SOT) పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నా.. గంజాయి అక్రమ రవాణా చేస్తూ కొందరు డబ్బులు సంపాదిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో తాజాగా ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి 14 కిలోల గంజాయి స్వాధీనం చేనసుకుంది. బాలానగర్‌లోని ఓ ఇంట్లో గంజాయి దందా సాగుతోందని అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిపై దాడులు చేశారు. అయితే నిందితులు అధికారులపై కుక్కను వదిలారు. కుక్కను అడ్డు పెట్టుకొని తప్పించునే ప్రయత్నం చేశారు. అంతేగాకుండా నిందితులు ఓ అధికారిపై దాడి చేశారు.
Eagle Force | ముగ్గురు అన్నదమ్ములు కలిసి..
స్థానికంగా ఉండే ముగ్గురు అన్నదమ్ములు దుర్గాప్రసాద్, రవి, కిరణ్ గంజాయి దందా చేస్తున్నారు. యువతను లక్ష్యంగా చేసి గంజాయి విక్రయిస్తున్నారు. ఈగల్ టీమ్ అధికారులు దాడులు చేసి ఈ ముగ్గురితో పాటు కమలాకర్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఒడిశా (Odisha) నుంచి పెద్ద ఎత్తున గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పేమెంట్ చేసిన వారికి వాట్సాప్ లో లొకేషన్ అడిగి నేరుగా గంజాయి సప్లై చేస్తున్నారు. కొందరు డబ్బు కోసం గంజాయి దందా చేస్తుండగా.. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
దీనిని కూడా చదవండి : Indiramma Sewing Machines | బీసీ మహిళలకు అదిరిపోయే న్యూస్.. ఇంటింటా ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్లు!