Delhi High Court | ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు

ఢిల్లీ హైకోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi High Court | ఢిల్లీ హైకోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రాజధానిలోని అనేక ఇతర ప్రదేశాలకు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు మధ్యాహ్నం 2:11 గంటలకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను పేల్చివేయండి అని బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఖలిస్తాన్ పేరుతో పంపిన ఈ ఇమెయిల్‌లో, నగరంలోని పలు ప్రదేశాలను పేల్చివేయడానికి సంబంధించిన ప్రణాళికల వివరాలు ఉన్నాయి. జామ్‌నగర్ హౌస్, ఝండేవాలన్ భవనం, సాకేత్ కార్యాలయం, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) టెర్మినల్ 3, మరియు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) కార్యాలయంతో సహా మరో ఆరు ప్రదేశాలకు ఈ బెదిరింపు అందింది.

Delhi High Court | పోలీసుల తనిఖీలు

బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. రేపు స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఈ బెదిరింపును తీవ్రంగా పరిగణించారు. అన్ని ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. డాగ్​ స్క్వాడ్​, బాంబు స్క్వాడ్​ సాయంతో సోదాలు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. కాగా రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇప్పటికే దేశ రాజధానిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి..: Karur Stampede Case | కరూర్ బాధితులకు బిగ్ రిలీఫ్ .. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *