Rahul Gandhi Defamation Case | రాహుల్‌ గాంధీకి ఊరట.. సావర్కర్ పరువునష్టం కేసు కొట్టివేత

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rahul Gandhi Defamation Case | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై నమోదైన క్రిమినల్ పరువునష్టం కేసును, అలాగే లక్నో కోర్టు జారీ చేసిన సమన్లను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.

Rahul Gandhi Defamation Case | వివాదాస్పద వ్యాఖ్యలు..

2022లో మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటీష్ వారికి సేవకుడిగా ఉండేవారని, వారి నుంచి పింఛను తీసుకున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది స్వాతంత్ర్య సమరయోధులను అవమానించేలా ఉందంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒకరు కోర్టులో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా లక్నో కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేయగా, దీనిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Rahul Gandhi Defamation Case | ఎలాంటి దాఖలాలు లేవని ..

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ( Supreme Court )ధర్మాసనం.. చట్టప్రకారంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వ అనుమతి (Sanction) తప్పనిసరి అని స్పష్టం చేసింది. అయితే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో సరైన అనుమతికి సంబంధించిన ఎలాంటి దాఖలాలు లేవని గుర్తించింది. ఈ సాంకేతిక కారణం ఆధారంగానే రాహుల్ గాంధీపై ఉన్న పరువునష్టం ఫిర్యాదును, లక్నో కోర్టు జారీ చేసిన సమన్లను పూర్తిగా కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

ఇది కూడా చదవండి:  Amrit Bharat Express | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. కొత్తగా ఏడు అమృత్​ భారత్​ రైళ్లు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *