bTranz 10th Anniversary | పదేళ్లు పూర్తి చేసుకున్న ‘బిట్రాంజ్’.. ఏఐ ఆధారిత వృద్ధిపై ప్రత్యేక దృష్టి

బిజినెస్ టెక్నాలజీ , ఈఆర్పీ (ERP) సొల్యూషన్స్ సంస్థ అయిన 'బిట్రాంజ్' (bTranz) తన ప్రస్థానంలో విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: bTranz 10th Anniversary | బిజినెస్ టెక్నాలజీ , ఈఆర్పీ (ERP) సొల్యూషన్స్ సంస్థ అయిన ‘బిట్రాంజ్’ (bTranz) తన ప్రస్థానంలో విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దశాబ్ద కాలంగా సాంకేతిక ఆవిష్కరణలు, కస్టమర్ భాగస్వామ్యాలు , భారత్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో సాధించిన వృద్ధిని పురస్కరించుకుని సంస్థ పదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.

bTranz 10th Anniversary | ఏఐ పాత్రపై ప్యానెల్ చర్చ..

ఈ సందర్భంగా “ఈఆర్పీ అమలులో ఏఐ పాత్ర” (Role of AI in ERP Implementation) అనే అంశంపై ప్రత్యేక ప్యానెల్ చర్చను ఏర్పాటు చేశారు. ఈ చర్చలో బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ సెంటర్ హెడ్ అంజాద్ ఖాన్ పఠాన్, జియో ప్లాట్‌ఫామ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎం.వి. రెడ్డి, ఎన్-లాబ్స్ ఏఐ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సంజీవ్ దేశ్‌పాండే తదితరులు ప్రముఖ వక్తలుగా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో బిట్రాంజ్ కేవలం ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సర్వీసెస్ అందించే సంస్థగానే కాకుండా.. ఈఆర్పీ, ఒరాకిల్ సొల్యూషన్స్, క్లౌడ్, ఆటోమేషన్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ తదితర సేవలతో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ భాగస్వామిగా ఎదిగింది.

bTranz 10th Anniversary | నిరంతర పరిణామమే మా విజయ ప్రయాణం..

ఈ సందర్భంగా బిట్రాంజ్ మేనేజింగ్ డైరెక్టర్ షేకర్ పాషా మాట్లాడుతూ.. “గత పదేళ్లు మాకు నిరంతర ప్రయాణం. సాంకేతిక అవసరాలు సాంప్రదాయ ఈఆర్పీ నుంచి క్లౌడ్, ఆటోమేషన్, అనలిటిక్స్ , ఏఐ వైపు మారుతున్న కొద్దీ మేము మా కస్టమర్లతో పాటు ఎదిగాము. వాస్తవ వ్యాపార సవాళ్లను పరిష్కరించడమే మా లక్ష్యంగా పనిచేశాం. ఇప్పుడు రెండవ దశాబ్దంలోకి అడుగుపెడుతున్న తరుణంలో.. ఏఐ , వర్ధమాన సాంకేతికతలు సృష్టించబోయే కొత్త అవకాశాలపై ఎంతో ఉత్సాహంగా ఉన్నాం” అని తెలిపారు.

bTranz 10th Anniversary | గ్లోబల్ విస్తరణ ప్రణాళికలు..

సంస్థ వృద్ధిలో హైదరాబాద్ ( Hyderabad )కీలక పాత్ర పోషిస్తోందని, ఇక్కడి బలమైన టెక్నాలజీ ట్యాలెంట్ పూల్ , డిజిటల్ ఎకోసిస్టమ్ తమ గ్లోబల్ డెలివరీ సామర్థ్యాలను మెరుగుపరుస్తోందని కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో ఏఐ-ఎనేబుల్డ్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆటోమేషన్, డేటా అండ్ అనలిటిక్స్‌పై మరింత దృష్టి పెట్టడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది.

bTranz 10th Anniversary | భవిష్యత్ టెక్నాలజీ భాగస్వామిగా నిలుస్తాం..

వచ్చే దశాబ్దం గురించి షేకర్ పాషా మాట్లాడుతూ.. “రాబోయే పదేళ్లు గత దశాబ్దం కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మా లక్ష్యం కేవలం పరిమాణంలో పెరగడం మాత్రమే కాదు.. భవిష్యత్తు ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో కస్టమర్లకు నమ్మకమైన టెక్నాలజీ భాగస్వామిగా నిలవడం. మా కస్టమర్లను మరింత చురుకైన, తెలివైన సంస్థలుగా తీర్చిదిద్దడానికి టెక్నాలజీ, ట్యాలెంట్ , ఆవిష్కరణలపై పెట్టుబడులు పెడుతూనే ఉంటాం” అని వెల్లడించారు.

తదుపరి దశాబ్దంలోకి అడుగుపెడుతున్న బిట్రాంజ్.. తన టెక్నాలజీ సామర్థ్యాలను మరింత పెంపొందించుకుంటూ, కస్టమర్ సంబంధాలను బలపరుస్తూ, భారత్ – మిడ్ల్ ఈస్ట్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది కూడా చదవండి: Samay Raina | స్టాండప్‌ కమెడియన్‌ సమయ్‌ రైనాకు ఊరట

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *