అక్షరటుడే, డిచ్పల్లి: MLA Bhupathi Reddy | ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
MLA Bhupathi Reddy | కాగితపు రేషన్‌కార్డుల స్థానంలో..
కాగితపు రేషన్ కార్డుల స్థానంలో పీవీసీ డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను (PVC Digital Smart Ration Card) రేపటి నుంచి జారీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొత్త లబ్ధిదారులతో సహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి 5 లక్షల మంది లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భౌతిక కార్డులను డిజిటల్ సేవలతో అనుసంధానం చేయడం ద్వారా ఒకే చోట అనేక సేవలను సులభంగా పొందే అవకాశం కలుగుతుందన్నారు. రేషన్ కార్డుల డిజిటలైజేషన్ వల్ల నకిలీ కార్డుల నివారణ, సేవల్లో పారదర్శకత, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి చేరడం, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.
MLA Bhupathi Reddy | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో..
నిజామాబాద్ రూరల్ (Nizamabad Rural) నియోజకవర్గ పరిధిలో 165 రేషన్ దుకాణాలు ఉన్నాయని, వాటి పరిధిలో మొత్తం 1,00,769 మంది లబ్ధిదారులు ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. వీరిలో 1,00,344 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి అర్హుడైన లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు సంబంధించిన సంక్షేమ వ్యవస్థలను ఆధునీకరించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు అవసరమైన సేవలను సులభతరం చేయడం కంటే రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, బాల్ రాజు, నాయకులు గొల్ల ఎర్రన్న, ఉమ్మాజి నరేష్, రాంచందర్ గౌడ్, బోర్గం శ్రీనివాస్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: India Independence Day | మన స్వాతంత్య్రం వెనక జపాన్… ఆగస్టు 15నే ఇండిపెండెన్స్ డే ఎందుకో తెలుసా?