తెలంగాణFuel Shortage | తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ కొరత

Fuel Shortage | తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ కొరత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fuel Shortage | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెట్రోల్​, డీజిల్ కొరత నెలకొంది. ఇంధనం దొరకదనే వార్తలు, కొరత ఉందని ప్రచారం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురై అధిక మొత్తంలో పెట్రోల్, డీజిల్​ కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్రోల్​ బంక్ (Petrol Bunk)​ల్లో నిల్వలు అయిపోయి నో స్టాక్​ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

వాహనదారులు పెట్రోల్​ బంక్​లకు బారులు తీరడంతో .. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల బంక్‌ల్లో స్టాక్​ అయిపోయింది. దీంతో నోస్టాక్​ బోర్డులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చాలా బంకుల్లో డీజిల్ కొరతో వాహనదారులు, రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం యాసంగి పంట కోతలు జోరుగా సాగుతున్నాయి. హార్వెస్టర్​కు భారీగా డీజిల్​ అవసరం. ఈ క్రమంలో డీజిల్​ దొరక్క కోత మిషన్లు నడవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Fuel Shortage | పరిమితంగా..

విజయవాడ, హైదరాబాద్, ఖమ్మం, కర్నూలు జిల్లాల్లో తీవ్రంగా ఇంధన సమస్య ఉంది. లీటర్ పెట్రోల్ కోసం గంటల తరబడి ప్రజలు లైన్​లో ఉంటున్నారు. కొన్ని బంకుల్లో టూవీలర్లకు రూ.200-300, కార్లకు రూ.వెయ్యి మాత్రమే పోస్తామంటూ నిబంధనలు పెడుతున్నారు. పరిమితంగా పోస్తుండటంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Fuel Shortage

Fuel Shortage | కొరత లేదు…

తెలంగాణలో ఇంధన కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సమృద్ధిగానే ఉన్నాయని వెల్లడించారు. వినియోగదారులు ఎలాంటి అపోహలకు గురి కావొద్దని కోరారు. ఏమైనా అనుమానాలు ఉంటే 1967 నంబర్​కు ఫోన్​ చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ (Black Market) చేస్తే కఠిన చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: BRS Formation Day | నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. వేడుకలు సర్వాంగ సుందరంగా ముస్తాబైన తెలంగాణ భవన్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....