అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TG SAFE | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతా శాఖ, ఔషధ నియంత్రణ శాఖలను కలిపేసింది. ఈ రెండు శాఖలను కలుపుతూ.. టీజీ సేఫ్ (Telangana Standards Authority for Food and Essential Drugs) అనే ఏకీకృత పరిపాలన కింద విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో లైసెన్సు పొందిన ఆహార వ్యాపార నిర్వాహకుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పాటు కల్తీ ఆహార పదార్థాల తయారీ సైతం పెరిగింది. నకిలీ, నాసిరకం ఆహార, ఔషధాలను నివారించి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆహార భద్రత శాఖ, ఔషధ నియంత్రణ శాఖలను సమన్వయం చేసింది. కొత్తగా టీజీ సేఫ్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీని కమిషనర్‌గా అవినాశ్ మొహంతిని ప్రభుత్వం నియమించింది. 2005 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.
TG SAFE | కల్తీ కట్టడే లక్ష్యంగా..
రాష్ట్రంలో ఇటీవల కల్తీ ఆహార పదర్థాలు, ఔషధాల విక్రయం పెరిగింది. దీంతో ప్రజలు అనారోగ్యం భారీన పడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాల కట్టడికి ఇప్పటికే హైదరాబాద్ నగరం పరిధిలో పోలీసులు హెచ్–న్యూ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆహార భద్రత శాఖ, ఔషధ నియంత్రణ శాఖలను విలీనం చేస్తే.. రెండు విభాగాల్లో కల్తీల కట్టడి చేయొచ్చని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు టీజీ సేఫ్ (TG SAFE)ను ఏర్పాటు చేసింది. దీంతో రెండు శాఖల సిబ్బంది ఒకచోట పని చేయనున్నారు. టీజీ సేఫ్‌కు తగినంత మంది పోలీసు సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వం డీజీపీని ఆదేశించింది. అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయాలని, నిర్దేశిత విధానానికి అనుగుణంగా, డిప్యుటేషన్, కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ సేవల ద్వారా ఖాళీగా ఉన్న అన్ని మంజూరైన పోస్టులను భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వాలని పేర్కొంది.
Avinash Mohanty, IPS (2005), who was earlier posted as Director General, Drugs Control Administration, Telangana, has been posted as Commissioner, Telangana SAFE (Telangana Standards Authority for Food and Essential Drugs), in addition to his normal duties. pic.twitter.com/RXBmXLRYiI
— IPRDepartment (@IPRTelangana) August 16, 2026
దీనిని కూడా చదవండి : Chicken Prices | శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు