అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad SPO Recruitment 2026 | హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న 150 ప్రత్యేక పోలీసు అధికారుల (ఎస్పీవో) పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోస్టుల కోసం మాజీ సైనికులు, మాజీ పారామిలటరీ బలగాలు , రిటైర్డ్ పోలీసు సిబ్బంది నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు.
Hyderabad SPO Recruitment 2026 | వయోపరిమితి , అర్హతలు..
మాజీ సైనికులు 2026 ఆగస్టు 31 నాటికి 58 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. అలాగే, మాజీ పారామిలటరీ , రిటైర్డ్ పోలీసు సిబ్బంది పదవీ విరమణ పొంది రెండేళ్లు దాటని వారై ఉండాలి. వీరికి గరిష్ట వయోపరిమితిని 62 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.26,000 గౌరవ వేతనంగా చెల్లిస్తారు. వీరికి వేతనంతో కూడిన సెలవులు ఉండవు. అత్యవసర సమయంలో వేతనం లేకుండా సెలవులు మంజూరు చేస్తారు.
Hyderabad SPO Recruitment 2026 | కావలసిన పత్రాలు..
దరఖాస్తుదారులు ఒరిజినల్ పత్రాలతో పాటు డిశ్చార్జ్ బుక్ లేదా డిశ్చార్జ్ సర్టిఫికెట్ లేదా రిటైర్మెంట్ ఆర్డర్, ఆధార్ కార్డ్ ( Aadhaar ), పాన్ కార్డ్, ఎస్బీఐ పాస్‌బుక్ జిరాక్స్, ఓటరు గుర్తింపు కార్డు సమర్పించాలి. వీటితో పాటు కుల ధ్రువీకరణ పత్రం, టెక్నికల్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ జతపరచాలి. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు చెల్లుబాటు అయ్యే ఎల్ఎంవీ (LMV) లేదా హెచ్ఎంవీ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించడంతో పాటు మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు అందజేయాలి.
Hyderabad SPO Recruitment 2026 | దరఖాస్తు చివరి గడువు..
ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన పత్రాలతో కూడి నేరుగా సమర్పించాల్సి ఉంటుంది. హైదరాబాద్ పెట్లబుర్జ్‌లోని సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ఎస్పీవోల కార్యాలయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను 25-08-2026 సాయంత్రం 5:00 గంటలలోపు అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోమని అధికారులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: POCSO Case Investigation | పోక్సో కేసుల విచారణలో వేగం పెంచాలి: సీపీ సాయిచైతన్య