Tarapith Hotel Fire | హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

పశ్చిమ బెంగాల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లో సోమవారం ( ఆగస్టు 17 )  తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tarapith Hotel Fire | పశ్చిమ బెంగాల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లో సోమవారం ( ఆగస్టు 17 )  తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నాలుగు అంతస్తుల హోటల్‌ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉదయం 5 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అతిథులందరూ గాఢ నిద్రలో ఉండటంతో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. ఈ దుర్ఘటనలో ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Tarapith Hotel Fire | క్షతగాత్రులకు చికిత్స..

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హోటల్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన క్షతగాత్రులను వెంటనే అత్యవసర చికిత్స కోసం రాంపూర్‌హాట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. తొలుత ఐదుగురు మృతి చెందినట్లు వార్తలు రాగా, ఆ తర్వాత మృతుల సంఖ్య ఏడుకు చేరుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా ధ్రువీకరించారు.

Tarapith Hotel Fire | ప్రమాదానికి కారణం ఏమిటి?

ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగి ఉండవచ్చని హోటల్ నిర్వాహకులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అగ్నిప్రమాదానికి అసలు కారణాలు ఏమిటనే కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  SRSP Water Storage | నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *