అక్షరటుడే, నిజామాబాద్ సిటీ/ముప్కాల్: Nagula Panchami Celebrations | ఉమ్మడిజిల్లాలో నాగుల పంచమిని వేడుకను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న పాము పుట్టల్లో పాలుపోసి తమ మొక్కులు తీర్చుకున్నారు.
Nagula Panchami Celebrations | నగరంలోని ఐటీఐలో..
నగరంలోని ఐటీఐ క్రీడామైదానంలో ఉన్న పాము పుట్టలో మహిళలు పెద్ద ఎత్తున పాలు పోశారు. ఈ సందర్భంగా మొక్కులు తీర్చుకున్నారు. అలాగే రేణుకానగర్, పవర్హౌస్ తదితర ప్రాంతాల్లో పాముపుట్టల వద్ద, నాగదేవత విగ్రహాలకు ప్రత్యేక పూజులు నిర్వహించారు.
ముప్కాల్ మండలంలో పడిలేచిన మర్రిచెట్టు..

మండలం (Nizamabad)లోని పడిలేచిన మర్రిచెట్టు వద్ద భక్తులు పెద్దసంఖ్యలో పూజలు నిర్వహించారు. నాగుల పంచమి సోమవారం రావడంతో భక్తులు పోటెత్తారు. భక్తులు నాగదేవతకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని నైవేద్యాలు సమర్పించారు. నాగులచవితి సందర్భంగా మర్రిచెట్టు పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
ఇది కూడా చదవండి..: SRSP Water Storage | నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం