Iran Warns US | నాలుగు రెట్ల విధ్వంసం చేస్తాం.. అమెరికాకు ఇరాన్​ వార్నింగ్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran Warns US | అమెరికా– ఇరాన్​ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నా.. మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఇరు దేశాల నేతలు మాటల తూటాలు పేలుస్తుండటంతో ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.

ఇరాన్​, అమెరికా మధ్య సీజ్​ఫైర్​ (Ceasefire) కుదిరిన విషయం తెలిసిందే. మొదట రెండు వారాలకు ఒప్పందం జరగ్గా.. తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) దానిని పొడిగించారు. ఇటీవల ట్రంప్​ మాట్లాడుతూ.. మూడు రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్‌ చమురు పైప్‌లైన్లను పేల్చేస్తానని హెచ్చరించారు. దీనిపై ఇరాన్‌ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్‌ సగ్‌హబ్‌ ఇస్ఫహానీ తీవ్రంగా స్పందించారు. చమురు క్షేత్రాలు సహా తమ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు (American Attacks) చేస్తే పరిణామలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అమెరికాకు మద్దతిచ్చే దేశాల్లో దానికి నాలుగు రెట్ల విధ్వంసానికి పాల్పడతామన్నారు.

Iran Warns US | మా లెక్కలు వేరు

తమ లెక్కలు వేరు అని ఇరాన్​ తెలిపింది. “మీరు ఒక ఒక చమురు బావి అంటే నాలుగు చమురు బావులు,” అని ఆయన అన్నారు. నిరంతర ఒత్తిడి, చమురును నిల్వకు లేదా ట్యాంకర్లకు తరలించే ఇరాన్ సామర్థ్యానికి అంతరాయం కలిగించవచ్చని ట్రంప్ సూచించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.

Iran Warns US | హర్ముజ్​పై సంప్రదింపులు

హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా సురక్షిత రవాణాను నిర్ధారించడానికి, ఆ జలమార్గంలో ఉమ్మడి ప్రయోజనాలను పరిరక్షించడానికి నిపుణుల స్థాయి సంప్రదింపులను కొనసాగించడానికి ఇరాన్, ఒమన్ అంగీకరించాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చి సోమవారం తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Russian President Vladimir Putin)తో చర్చల కోసం సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చేరుకున్న సందర్భంగా అరాఖ్చి ఈ ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి..: White House Shooting | వైట్​హౌస్​లో కాల్పుల కలకలం.. ట్రంప్​ తరలింపు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *