అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 18 Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌తో 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అంగీకరించకపోవడంతో హార్ముజ్ జలసంధి మీదుగా ఇంధన సరఫరాలపై ఆందోళనలు నెలకొంది.
దీంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలలో పెరుగుదలతో ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్‌ను వెంటాడుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. భారత ఈక్విటీ మార్కెట్లు సైతం నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Aug 18 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 0.32 శాతం, ఎస్ అండ్ పీ 0.52 శాతం తగ్గగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.02 శాతం నష్టంతో ఉంది.
Aug 18 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.28 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.39 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.67 శాతం నష్టపోయాయి.
Aug 18 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 1.57 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.07 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.82 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.43 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.22 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.21 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.33 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 2,535 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డీఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 5,101 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు బలహీనపడి 95.61 వద్ద ఉంది.
అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఆందోళనలతో పాటు ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.60 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.73 వద్ద ఉన్నాయి.
Lingampet Husband Attack | భర్త ఘాతుకం.. భార్యపై అర్ధరాత్రి కత్తితో దాడి
అమెరికా, ఇరాన్‌ల మధ్య సంఘర్షణను ముగించే విషయంలో ఒప్పందం కుదిరే అవకాశాలు బలహీనపడటంతో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 91.08 డాలర్ల వద్ద ఉంది.