జాతీయంBengal Elections | బెంగాల్​లో కమలం వికసిస్తుంది : ప్రధాని మోదీ

Bengal Elections | బెంగాల్​లో కమలం వికసిస్తుంది : ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం బెంగాల్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bengal Elections | పశ్చిమ బెంగాల్​లో రెండో దశ ఎన్నికలు ఈ నెల 29న జరగనున్నాయి. నేటితో ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ (PM Modi) చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఎంసీ పాలనపై విమర్శలు చేసిన ఆయన.. బెంగాల్​లో కమలం వికసిస్తుందన్నారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జనసంఘ్‌కు బెంగాల్‌ పుట్టినిల్లు అన్నారు. మమతకు 15 ఏళ్లు అవకాశం ఇచ్చారని, మహిళల భద్రత కోసం దీదీ సర్కార్‌ ఏం చేయలేదన్నారు. రైతులు, యువత కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. బూతులు తిట్టడం, అబద్ధాలు చెప్పడమే టీఎంసీ విధానం అని విరుచుకుపడ్డారు. బీహార్‌, ఒడిశాలో కమలం వికసించిందని, ఇప్పుడు బెంగాల్‌ వంతు అన్నారు.

Bengal Elections | ప్రమాణ స్వీకారానికి వస్తా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బ్యారక్‌పూర్‌ (Barrackpore)లో జరిగిన విజయ సంకల్ప సభలో ప్రసంగించారు. రాష్ట్రంతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించారు. మే 4న ఫలితాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ (BJP) సీఎం ప్రమాణ స్వీకారానికి తాను హాజరు అవుతానని చెప్పారు. బెంగాల్‌లో జరిగిన ర్యాలీలు, రోడ్‌షోల సమయంలో, తాను ఎప్పటికీ మరచిపోలేని హృదయపూర్వక సందేశాలు, చిత్రపటాలు అందుకున్నానని తెలిపారు.

Bengal Elections | గెలుపు ఎవరిదో..

పశ్చిమ బెంగాల్​లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో 77 సీట్లు మాత్రమే సాధించినా.. 38 శాతం ఓట్లను సాధించడం గమనార్హం. టీఎంసీ 48 శాతం ఓట్లతో 215 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్​, వామపక్షాల ప్రభావం అంతగా ఉండే అవకాశం లేదు. ఈ 23న జరిగిన తొలి దశ పోలింగ్​ రికార్డు స్థాయిలో ఓటింగ్​ నమోదు అయింది. 29న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. తాము అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న మమతా బెనర్జీపై రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది. అంతేగాకుండా టీఎంసీ నాయకులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో బెంగాల్​ ఓటర్లు కాషాయ పార్టీని గెలిపిస్తారా.. మరోసారి దీదీకి జై కొడుతారా చూడాలి.

ఇది కూడా చదవండి..: AAP MPs Join BJP | బీజేపీ గూటికి ఏడుగురు ఎంపీలు.. విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...