అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gaja Capital IPO | గజ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్(Gaja Alternative Asset Management) కంపెనీని 2004లో స్థాపించారు. రెండు దశాబ్దాలకుపైగా అనుభవం కలిగి ఉన్న ఆల్టర్నేటివ్ మేనేజ్మెంట్ కంపెనీలలో ఇది ఒకటి.
‘గజ క్యాపిటల్ ’ అనే బ్రాండ్ పేరుతో పనిచేసే స్వదేశీ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ కంపెనీ 2 రకాల ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లను (కేటగిరీ 1, మరియు 2) నిర్వహిస్తుంది. భారతీయ కంపెనీలలో పెట్టుబడి పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు కూడా ఈ సంస్థ సహాయం చేస్తుంటుంది.
Gaja Capital IPO | మూడు మార్గాల ద్వారా ఆదాయం…
ప్రధానంగా ఈ కంపెనీకి ఆదాయం 3 మార్గాల ద్వారా వస్తుంది: మేనేజ్మెంట్ ఫీజులు, క్యారీడ్ ఇంటరెస్ట్, స్పాన్సర్‌గా పెట్టుబడి పెట్టిన డబ్బుపై వచ్చే రాబడి.
Gaja Capital IPO | రూ. 550 కోట్ల ఐపీవో..
గజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ (గజా క్యాపిటల్) మార్కెట్ నుంచి రూ. 550 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 450 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్లు మరియు ఇతర ప్రధాన వాటాదారులు తమ వాటాను విక్రయించడం ద్వారా రూ. 100 కోట్లు సమీకరించనున్నారు. ఐపీవో (IPO) ద్వారా వచ్చిన నిధులను ఫండ్ కమిట్మెంట్లను నెరవేర్చుకోవడం కోసం, రుణాలు చెల్లించడం ద్వారా కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ను మరింత బలోపేతం చేసుకోనున్నట్లు కంపెనీ తెలిపిది.
Gaja Capital IPO | ప్రైస్ బ్యాండ్..
కంపెనీ ధరల శ్రేణిని రూ. 152 నుంచి రూ. 160గా నిర్ణయించింది. ఒక లాట్లో 93 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం రూ. 14,880 తో బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోటా : ఐపీవోలో క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ ఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు.
జీఎంపీ : కంపెనీ షేర్లకు రూ. 30 గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ సమయంలో 18 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయని జీఎంపీ సూచిస్తోంది.
ఐపీవో తేదీలు : ఆగస్టు 19న ప్రారంభమైన సబ్స్క్రిప్షన్ ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. షేర్ల అలాట్మెంట్ ప్రక్రియ ఆగస్టు 24న పూర్తయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఆగస్టు 26న దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: Aug 19 Gold Prices | బంగారం ధరలకు మరింత ఊతం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర ఎంతంటే?