అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao House Arrest | సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రిని పరిశీలించేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ అగ్రనేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులను పోలీసులు కట్టడి చేసి, ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
Harish Rao House Arrest | కోకాపేటలో తీవ్ర ఉద్రిక్తత..
సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రికి వెళ్లకుండా మాజీ మంత్రి హరీశ్ రావును నిరోధించేందుకు కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు, సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Harish Rao House Arrest | హరీశ్ రావు ఫైర్..
పోలీసుల అక్రమ నిర్బంధాలు, హౌస్ అరెస్టులపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఆస్పత్రుల్లోని డొల్లతనం ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అరెస్టులకు పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ, పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్!
మాజీ మంత్రులు @BRSHarish, @BrsSabithaIndra, @YadavTalasani లను ముందస్తుగా నిర్బంధించిన పోలీసులు.కోకాపేటలోని హరీశ్ రావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు, హౌస్ అరెస్ట్ విషయం… pic.twitter.com/ZKTlLWQTQe
— BRS Party (@BRSparty) August 19, 2026
ఇది కూడా చదవండి: Vijay MLA Benefits | ఎమ్మెల్యేలకు ఉచితంగా కార్లు.. సీఎం విజయ్ కీలక నిర్ణయం