అక్షరటుడే వెబ్డెస్క్: Brahmanandam Brother | కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇంట్లో ప్రస్తుతం భావోద్వేగ వాతావరణం నెలకొంది. తనను కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆయన సొంత అన్నయ్య శ్రీవదన్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యానాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Brahmanandam Brother | పలకరింపు కోసం ఎదురుచూస్తున్నా..
తమ కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ శ్రీవదన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము మొత్తం ఆరుగురు అన్నదమ్ములమని, వారిలో ఇప్పటికే నలుగురు మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం మిగిలింది తాము ఇద్దరమే అయినప్పటికీ, ఈ వృద్ధాప్యంలో తాను పూర్తిగా ఒంటరినైపోయానని ఆయన వాపోయారు.
Brahmanandam Brother |తమ్ముడు అడిగే ఆ ఒక్క మాట కోసం..
ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం సొంత ఊరికి వచ్చినా, కనీసం తనను చూడటానికి రాలేదని, ఫోన్ చేసి కూడా పలకరించలేదని శ్రీవదన్ కంటతడి పెట్టారు. ‘ఏరా అన్నయ్య.. ఎలా ఉన్నావ్?’ అని తమ్ముడు అడిగే ఆ ఒక్క మాట కోసం తాను రోజూ ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. సమాజంలో ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నవారు చిన్నవారైన తోడబుట్టిన వారిని పలకరిస్తే వచ్చే ఆనందమే వేరని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ వార్త అందరినీ కలచివేస్తోంది.
వృద్ధాప్యంలో “అన్నయ్య” అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్న బ్రహ్మానందం గారి తోడబుట్టిన అన్నయ్య శ్రీ వదన్ గారు.
“మేము ఆరుగురం. నలుగురు చనిపోయారు. మిగిలింది ఇద్దరమే. ఇప్పుడు ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాను. తమ్ముడు ఒక్కసారైనా ఫోన్ చేసి ‘అన్నయ్య ఎలా ఉన్నావు?’ అని అడుగుతాడేమో అని ఆశగా… pic.twitter.com/lLcE6odSpP
— Milagro Movies (@MilagroMovies) August 19, 2026
ఇది కూడా చదవండి: Raja Singh BJP Criticism | గ్రూపు రాజకీయాలతోనే పదవులు రాలేదు.. బీజేపీ నేతలపై రాజాసింగ్ విమర్శలు