TGSP Commandants Promotions | TGSP అడిషనల్ కమాండెంట్లకు కమాండెంట్లుగా ప్రమోషన్లు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ప్రమోషన్లతో పాటు వారి బదిలీలు, పోస్టింగ్ ప్రదేశాలను ఖరారు చేస్తూ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరిట G.O.Rt.No.667 విడుదల అయ్యాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: TGSP Commandants Promotions | తెలంగాణ Telangana రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (TGSP) బెటాలియన్లలో పనిచేస్తున్న పలువురు అడిషనల్ కమాండెంట్లకు కమాండెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రమోషన్లతో పాటు వారి బదిలీలు, పోస్టింగ్ ప్రదేశాలను ఖరారు చేస్తూ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరిట G.O.Rt.No.667 విడుదల అయ్యాయి.

తెలంగాణ జనరల్ రూల్స్, 1996లోని రూల్ 10 (a) ప్రకారం రూ. 83,100 – 1,54,690/- వేతన శ్రేణిలో తాత్కాలిక (Adhoc) ప్రాతిపదికన ఈ ప్రమోషన్లు, బదిలీల ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.

TGSP Commandants Promotions | పదోన్నతి, పోస్టింగుల వివరాలు..

పి.వి. నారాయణస్వామి: గ్రేహౌండ్స్ అడిషనల్ కమాండెంట్‌గా ఉన్న ఈయనకు ప్రమోషన్ ఇచ్చి, గ్రేహౌండ్స్ కమాండెంట్/గ్రూప్ కమాండర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.

సి.వి.ఎ. లక్ష్మీకాంత రావు: ఇంటెలిజెన్స్ అడిషనల్ కమాండెంట్‌గా ఉన్న ఈయనకు పదోన్నతి కల్పించి, ములుగు జిల్లా చాల్వాయిలోని 5వ బెటాలియన్ TGSP కమాండెంట్‌గా నియమించారు.

బి. రామకృష్ణ: కొండాపూర్ 8వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఈయనకు ప్రమోషన్ ఇచ్చి, నల్గొండ జిల్లా అన్నెపర్తిలోని 12వ బెటాలియన్ TGSP కమాండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు.

Calcutta High Court | మసీదుల లౌడ్‌స్పీకర్ల తొలగింపుపై పిటిషన్ కొట్టివేత

TGSP Commandants Promotions | బదిలీ అయిన కమాండెంట్ల వివరాలు..

ఎన్.వి.ఎస్. శ్రీనివాస రావు: గ్రేహౌండ్స్ కమాండెంట్‌గా ఉన్న ఈయన్ను వరంగల్ (మామునూరు) 4వ బెటాలియన్ TGSP కమాండెంట్‌గా బదిలీ చేశారు.

డి. శివప్రసాద్ రెడ్డి: మామునూరు 4వ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న ఈయన్ను హైదరాబాద్ (కొండాపూర్) 8వ బెటాలియన్ TGSP కమాండెంట్‌గా బదిలీ చేశారు.

కె. వీరయ్య: అన్నెపర్తి 12వ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న ఈయన్ను హైదరాబాద్ (యూసుఫ్‌గూడ) 1వ బెటాలియన్ TGSP కమాండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు.

పి. సత్యనారాయణ: నిజామాబాద్ (డిచ్‌పల్లి) 7వ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న ఈయన్ను ఇంటెలిజెన్స్ (ISW) కమాండెంట్‌గా బదిలీ చేశారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *