అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ponguleti on BRS | ప్రతిపక్ష పార్టీగా కూడా బీఆర్ఎస్ ఫెయిల్ అయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిపక్షం హోదాలో ఉండి అబద్దాలను పదే పదే చెబుతూ ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తున్న ఆ పార్టీతో ప్రజలకు ఏలాంటి ఉపయోగం లేదని విమర్శించారు.
కమీషన్లు, అవినీతి గురించి మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతుంటే హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వారు చేసిన అవినీతి గురించి స్వయంగా పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. అవినీతి గురించి హరీశ్ రావు నీతి వాక్యాలు చెబుతుంటే బీఆర్ఎస్ నేతలు కూడా నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు.
Ponguleti on BRS | విచ్చలవిడిగా దోచుకున్నారు
రబ్బరు చెప్పులతో తిరిగిన అగ్గిపెట్టె రావు… పదేండ్లలో విచ్చలవిడిగా దోచుకున్నారని పొంగులేటి ఆరోపించారు. తరతరాలకు తిన్నా తరగని డబ్బు సంపాదించారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం కష్టపడ్డారో, ఎలాంటి వ్యాపారం చేశారో, అంత తక్కువ సమయంలో ఎవరికీ సాధ్యం కానంత డబ్బు ఎలా సంపాదించారో అని ప్రశ్నించారు. ఆ రహస్యం ఏంటో ప్రజలకు వివరిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలోనూ దోచుకున్న బీఆర్ఎస్ నేతలు కమీషన్ల ప్రభుత్వమని మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
ఇది కూడా చదవండి..: Rajiv Gandhi Jayanti | రాజీవ్‌గాంధీ సేవలను కొనియాడిన పొన్నం ప్రభాకర్