22A land complaints | 22ఏ సమస్యపై ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తాం : మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా చర్యలను మరింత వేగవంతం చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : 22A land complaints | రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తెలిపారు. కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి దరఖాస్తును కేవలం ఒక ఫిర్యాదుగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

హైదరాబాద్ (Hyderabad)​ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు భూములు నిషేధిత జాబితాలో చేరిన విషయం తెలిసిందే. నగరంలోని ఇళ్లు, ప్లాట్లను కూడా 22ఏ జాబితాలో పెట్టడంతో వాటిని అమ్ముకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత, బీఆర్​ఎస్​ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. నిజమైన హక్కుదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

22A land complaints | ఫిర్యాదులపై ఆరా..

22ఏ ఫిర్యాదులకు (22A land complaints) సంబంధించి ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు వస్తున్న కాల్స్, వాటి పరిష్కారం, ఏయే సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయనే అంశాలపై గురువారం మంత్రి పొంగులేటి ఆరా తీశారు. నాలుగు జిల్లాల్లో 22ఏ అంశంపై ప్రస్తుత పరిస్థితి, దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి వదిలేయకుండా, దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత తహశీల్దార్, ఆర్డీవో, సబ్‌రిజిస్ట్రార్ తదితర అధికారులకు పంపించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యను చెప్పిన తర్వాత పరిష్కారం కోసం మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఇప్పటికే సబ్‌రిజిస్ట్రార్లు, తహశీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్ల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు, గడచిన రెండు మూడు రోజుల్లో కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి : Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *