Alaska Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

అమెరికాలోని పశ్చిమ అలస్కాలో ఒక మారుమూల ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Alaska Plane Crash | అమెరికాలోని పశ్చిమ అలస్కాలో ఒక మారుమూల ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న చార్టర్డ్ విమానం రాడార్ కేంద్రం సమీపంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB) బోర్డు ఛైర్మన్ క్లింట్ జాన్సన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు.

Alaska Plane Crash | ప్రయాణ మార్గం..

రెండు ఇంజిన్లతో కూడిన సెస్నా చార్టర్ విమానం యాంకరేజ్ నుంచి కేప్ న్యూన్‌హామ్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. గుడ్‌న్యూస్ బేకు దక్షిణంగా సుమారు 40 మైళ్ల దూరంలో ఉన్న మారుమూల రాడార్ కేంద్రం సమీపంలో ఈ ఘటన జరిగింది. కేప్ న్యూన్‌హామ్ ప్రాంతంలో వైమానిక దళానికి చెందిన రన్‌వే ఉండగా, అక్కడికి సమీపంలోని దూర ప్రాంత రాడార్ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ విమానం కూలిపోయింది.

Alaska Plane Crash | సహాయక చర్యలు ..

విమానం కూలిపోయిన సమాచారం అందిన వెంటనే NTSB, అలస్కా స్టేట్ ట్రూపర్స్, రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో పలు సవాళ్లు ఎదురయ్యాయి. విమానంలో ఉన్నవారందరూ మృతి చెందినట్లు అమెరికా సైన్యం , సంబంధిత అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు.

Alaska Plane Crash | ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు..

ప్రస్తుతం ఈ విమాన ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వాతావరణ పరిస్థితులు, విమానం సాంకేతిక లోపాలు , పైలట్లకు సంబంధించిన అంశాలపై జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB) దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు పూర్తియిన తర్వాత ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఈ అకస్మిక ప్రమాదంతో అలస్కాలో తీవ్ర విషాదం అలుముకుంది.


ఇది కూడా చదవండి:  Konda Surekha | కొండా సురేఖను బర్తరఫ్​ చేయాలి.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేల డిమాండ్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *