Rayadurgam Land Price | ఎకరాకు రూ.264 కోట్లు.. రాయదుర్గంలో రికార్డు ధర

రాయదుర్గంలో ఎకరం ధర రూ.264 కోట్లు పలికింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబెడెస్క్ : Rayadurgam Land Price | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో భూములు రికార్డు ధరలు పలుకుతున్నాయి. గతంలో కోకాపేటలోని నియోపాలిస్​ లే అవుట్​లో భారీగా ధరలు పలుకగా.. తాజాగా ఆ రికార్డులను రాయదుర్గం అధిగమించింది.

రాయదుర్గంలోని టీజీఐఐసీ (TGIIC) భూములకు తాజాగా అధికారులు వేలం నిర్వహించారు. పాన్ మక్తా ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 83/1లోని 5.25 ఎకరాలకు ఆన్‌లైన్‌లో వేలం వేశారు. ఈ భూమిని ఎకరాకు రూ.264 కోట్లకు ఓ సంస్థ కొనుగోలు చేసింది. గతంలో ఇదే సర్వే నంబరు (83/1) ప్రాంతంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలుకగా.. తాజాగా రూ.264 కోట్లు పలకడం విశేషం.

Rayadurgam Land Price | నియోపాలిస్​ను దాటి..

హైదరాబాద్​ నగరంలో గతంలో కోకాపేట (Kokapet) భూములు రికార్డు ధర పలికేవి. నియోపాలిస్​ లే అవుట్​లోని భూములకు ప్రభుత్వం వేల వేయగా.. రూ.100 కోట్ల నుంచి రూ.190 కోట్ల వరకు ధర పలికాయి. తాజాగా రాయదుర్గం భూములు ఆ రికార్డును అధిగమించాయి. భూములకు భారీగా ధరలు రావడంతో రియల్​ ఎస్టేట్​ రంగం మళ్లీ పుంజుకుంటుందని వ్యాపారులు ఆశిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Maharashtra Cooking Oil Ban | లూజ్ ఆయిల్ విక్రయాలు బంద్.. సర్కార్ కీలక నిర్ణయం

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *