Ultraviolette Space Station | హైదరాబాద్‌లో ఆల్ట్రావైలెట్ మూడో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

రిటైల్ , సేవా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా ఆల్ట్రావైలెట్ సంస్థ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సరికొత్త ‘యూవీ స్పేస్ స్టేషన్’ను ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ultraviolette Space Station | రిటైల్ , సేవా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా ఆల్ట్రావైలెట్ సంస్థ హైదరాబాద్‌లోని ( Hyderabad )కూకట్‌పల్లిలో సరికొత్త ‘యూవీ స్పేస్ స్టేషన్’ను ప్రారంభించింది. డీలర్ భాగస్వామి ‘ఎం/ఎస్ ప్రొగ్రెస్సివ్ ఆటోక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొత్త కేంద్రం ఏర్పాటుతో దేశవ్యాప్తంగా ఆల్ట్రావైలెట్ తన పట్టును 35 నగరాలకు విస్తరించింది. ఇటీవల ఈవీల వినియోగాన్ని పెంచేందుకు ‘కిల్ ది పెట్రోల్ బిల్’ కార్యక్రమం, భారతదేశంలో టైప్ 6 ఛార్జింగ్ నెట్‌వర్క్‌కోసం బోల్ట్.ఎర్త్ (Bolt. Earth)తో భాగస్వామ్యం, అలాగే ‘బ్యాటరీ ఫ్లెక్స్’ (BaaS) ప్రోగ్రామ్ వంటి వరుస కీలక మైలురాళ్ల తర్వాత ఈ కేంద్రం ప్రారంభం కావడం విశేషం.

Ultraviolette Space Station  | అద్భుతమైన ఫీచర్లు..

కూకట్‌పల్లిలోని ఈ నూతన కేంద్రం ద్వారా ఆల్ట్రావైలెట్ పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లయిన ఎక్స్-47 క్రాస్ఓవర్ (X-47 Crossover) , ఎఫ్77 (F77) ఎలక్ట్రిక్ బైకులు అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. ఈ బైకుల ప్రధాన ప్రత్యేకతలు:

పవర్ , టార్క్: ఇవి 40.2 హెచ్‌పీ పవర్ , 100 Nm టార్క్‌ను అందించే పవర్‌ట్రెయిన్‌తో వస్తాయి.

వేగం: కేవలం 2.8 సెకన్లలోనే గంటకు 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి.

బ్యాటరీ , రేంజ్: 10.3 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీతో కూడిన ఈ బైకులు, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 323 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను అందిస్తాయి.

Ultraviolette Space Station  | బ్రాండ్ అనుభవం..

ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కేవలం విక్రయాల కేంద్రం మాత్రమే కాకుండా, వినియోగదారులకు సమగ్రమైన అనుభవాన్ని అందించేలా రూపుదిద్దుకుంది. వాహన ప్రియులు నేరుగా బైకులను పరిశీలించడంతో పాటు, తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రత్యేక టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ మోటార్‌సైకిల్ ఉపకరణాలు , సంబంధిత వస్తువులు కూడా లభిస్తాయి.

Ultraviolette Space Station  | సీఈవో హర్షం..

ఈ ప్రారంభోత్సవంపై ఆల్ట్రావైలెట్ సీఈవో , కో-ఫౌండర్ నారాయణ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. భారతదేశ టాప్ టెక్నాలజీ హబ్‌లలో ఒకటైన హైదరాబాద్‌లో తాము చూస్తున్న బలమైన అమ్మకాల జోరు, పెరుగుతున్న రైడర్ల కమ్యూనిటీ తమ ఆశయాలకు అద్దం పడుతున్నాయని తెలిపారు. ఈ కొత్త కేంద్రం ద్వారా నగరంలోని వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.

చిరునామా: TNR పటేల్ ప్లాజా, మూసాపేట్ రోడ్, ఎస్పీ నగర్, భరత్ నగర్, మూసాపేట్, హైదరాబాద్, తెలంగాణ – 500018.

ఇది కూడా చదవండి: Kamareddy Crime Control | నేర నియంత్రణ, గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలి : డీఐజీ సన్‌ప్రీత్ సింగ్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *