Heavy Rains | రైతులకు గుడ్​న్యూస్​.. రేపటి నుంచి భారీ వర్షాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Heavy Rains | రాష్ట్రంలో గత నాలుగు రోజులు వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్​ చెప్పారు. అల్ప పీడన ప్రభావంతో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణ (Telangana)లో శనివారం సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం, అర్ధరాత్రి వేళ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్​, ఆసిఫాబాద్, నిర్మల్​, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది. మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్​, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్​, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.

Heavy Rains | అల్ప పీడన ప్రభావంతో..

అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 23 నుంచి 27 వరకు వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. కాగా ఈ వానాకాలం సీజన్​లో రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదు అయింది. సాధారణ వర్షపాతం 505.2 మి.మీ. కాగా.. ఆగస్టు 21 వరకు 432.6మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. 14 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. అయితే మెదక్​, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి.

ఇది కూడా చదవండి..: Yadadri Pharma Accident | యాదాద్రి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు..ఇద్దరు కార్మికుల దుర్మరణం..10 మందికి గాయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *