Mallu Ravi | కొండా సురేఖ వివాదం.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై పీసీసీ క్రమశిక్షణ ఛైర్మన్​ కమిటీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallu Ravi | మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యవహారంపై పీసీసీ (PCC) క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారన్నారు. వాటిని పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.

ఇటీవల కాంగ్రెస్​లో పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ శనివారం సమావేశం అయింది. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. కొండా సుష్మిత, చిన్నారెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి అంశాలపై చర్చించామన్నారు. కొండా సురేఖ ఇచ్చిన వివరణ చూశామన్నారు. అలాగే కొండా సుస్మిత మాట్లాడిన వీడియోలు పరిశీలించామన్నారు. ఆమె ముఖ్యమంత్రిని మాములు వ్యక్తిగా అనుచిత వాఖ్యలు చేసిందన్నారు. కొండా సురేఖ, సుష్మితపై కొంతమంది ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీకి రీపోర్ట్ ఇస్తామని చెప్పారన్నారు. వాటిని పరిశీలించి మరోసారి సమావేశం అవుతామన్నారు. అనంతరం నిర్ణయం తీసుకుంంటామని తెలిపారు.

Mallu Ravi | మళ్లీ వివరణ తీసుకుంటాం

మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడిన వీడియోలు పరిశీలించామని మల్లు రవి తెలిపారు. ఆయనపై మేఘారెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. చెన్నారెడ్డి ఇచ్చిన వివరణ కూడా కమిటీ పరిశీలించిందని చెప్పారు. మేఘారెడ్డి వివరణ సైతం తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే ఆదిలాబాద్​లో జరిగిన పొలిటికల్ ఎఫెక్స్ కమిటీ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డికి, సంజీవ రెడ్డికి జరిగిన వివాదంపై ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు.

దీనిని కూడా చదవండి : Konda Surekha | మంత్రి కొండా సురేఖపై చర్యలు తప్పవా.. పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *