Rishabh Pant Injury | రేపు రిషబ్​ పంత్ ఆడతాడా.. గాయంపై కీలక అప్​డేట్​

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్​లో భారత బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​ గాయంతో మైదానాన్ని వీడాడు. రెండో రోజు అతడు బ్యాటింగ్ చేస్తాడని కోచ్​ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rishabh Pant Injury | శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ (Second Test)​లో భారత బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​ గాయంతో మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు అతడు బ్యాటింగ్​కు వస్తాడని కోచ్​ తెలిపారు.

కొలంబోలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీనిపై భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక సమాచారం అందించారు. ఆట చివరి సెషన్‌లో శ్రీలంక (Srilanka) పేసర్ లహిరు కుమార విసిరిన బంతి పంత్ ఎడమ చేతికి బలంగా తాకిందన్నారు. ఫిజియో చికిత్స అందించినప్పటికీ, అతను మైదానాన్ని వీడక తప్పలేదని తెలిపారు. అవసరమైతే పంత్ రెండో రోజు బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడని కోటక్ వెల్లడించారు.

Rishabh Pant Injury | మణికట్టుకు తాకిన బాల్​

58వ ఓవర్లో కుమార బౌలింగ్‌లో మొదటి బంతికే పంత్​ (Rishabh Pant Injury ) గాయపడ్డాడు. షార్ట్​బాల్​ను ఆఫ్ సైడ్ వైపు ‘పుల్’ షాట్ ఆడటానికి పంత్ ప్రయత్నించగా.. బాల్​ మణికట్టుకు తాకింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంత్ రిటైర్డ్​హట్​గా వెను తిరిగాడు. అతడు 15 బంతుల్లో 3 పరుగుల చేశారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్​ 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ద్రువ్​ జురేల్​, సారాన్ష్​ జైన్​ ఉన్నారు. రెండో రోజు పంత్​ బ్యాటింగ్​కు దిగకపోతే 10 మందితోనే భారత్​ ఆడాల్సి ఉంటుంది. అయితే పంత్ బ్యాటింగ్​ చేస్తాడని కోచ్​ చెప్పడంతో భారత్​ 400 పరుగులు చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : Dharmapuri Sanjay | ఎంపీ అర్వింద్​పై మాజీ మేయర్​ సంజయ్​ ఆగ్రహం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *